Friday, 31 July 2026 09:36:17 PM

గోదావరిఖనిలో పట్టపగలే కత్తిపోట్లు...

Date : 31 December 2024 12:49 PM Views : 4895

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : గోదావరిఖనిలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కంప్యూటర్ సెంటర్ లో పని చేసే నంది శ్రీనివాస్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశారు. దీంతో కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :