Thursday, 30 July 2026 02:42:44 PM

పేకాట రాయుళ్ల అరెస్టు...

Date : 01 May 2023 10:28 PM Views : 712

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జాపూర్ గ్రామా శివార్ లో ప్రభుత్వం నిషేధించిన పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్సై నరేష్ తన సిబ్బందితో వెళ్లి దాడి చేయగా ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ ఉండగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన మైదం లచన్న, సుర్జాపూర్ కు చెందిన టకిరే మారయ్య, పెద్ద తిమ్మాపూర్ కు చెందిన బాసిక హనుమంతు,జంగంపల్లికి చెందిన కుమ్మరి ఆకాష్,చిన్న తిమ్మాపూర్ కు చెందిన కొటారి లింగయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 మొబైల్ ఫొన్ లు,8300 రూపాయలు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.అలాగే బోరుకుంట్ల లింగయ్య,గోలేటి రాజు,టకిరే సత్తయ్య,చెండే జగన్,మంగలి మల్లేష్,కశెట్టి చందు,మేర్పల ప్రశాంత్ లు పరారీలో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా కన్నెపల్లి ఎస్సై మాట్లాడుతూ... మండలంలోని ప్రతి గ్రామంలో ఎవరు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన పక్క సమాచారం ఉంటుందని కాబట్టి ప్రభుత్వం నిషేధించిన పేకాట ఆడితే చట్టపరంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.పేకాట రాయుళ్లను పట్టుకున్న వారిలో సిబ్బంది శ్రీనివాస్, వెంకటేష్, మహేష్ ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :