ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : టిప్పర్ లారీ ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లయ్యగూడ తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పుల్లయ్యగూడ తండాకు చెందిన భూక్య జ్యోతి, వెంకన్న దంపతుల కుమారుడు అనిల్(10) గూడూరు మండలం అయోధ్యపురం ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే ఒక్కపూట బడి కావడంతో పాఠశాలకు వెళ్లి వచ్చిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న కిరాణా షాపుకు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా గూడూరు నుంచి నెక్కొండవైపు వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.బాలుడి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో పుల్లయ్యగూడ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Admin
Aakanksha News