Friday, 31 July 2026 02:14:36 PM

ప్రాణం తీసిన అనుమానం...

భర్త వేధింపులు తాళలేక భార్య బలవన్మరణం.

Date : 28 December 2024 09:33 PM Views : 1626

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అనుమానిస్తుండటంతో పాటు అదనంగా ₹5 లక్షలు కావాలని భర్త వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాపూజీనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ.ఎల్.భూమేష్ కథనం ప్రకారం..భాపూజీ నగర్ కు చెందిన కాకనాడ కుమారస్వామి సెప్టెంబర్ 10 ,2024 నా అదే కాలనీ కి చెందిన మాడుగుల లలిత (18) ను ప్రేమించి వివాహం వేసుకున్నాడు.పెళ్లి అయిన నాటి నుంచి ఎలాంటి పని చేయకుండా ..నిత్యం మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతూ పలు కేసుల్లో జైల్ కు వెళ్లి వచ్చాడు.ఐతే నిత్యం భార్య లలిత ను కుమారస్వామి మట్టెలు,పుస్తెలతాడుతో పాటు అదనంగా ₹5 లక్షలు కట్నం కావాలని వేధించేవాడని తెలిపారు.దీంతో లలిత శ్రీరాంపూర్ లో నివాసం ఉండే తన తల్లి తండ్రులైన మాడుగుల మీనరావు ,శారద వద్దకు ఈ నెల 26 వెళ్లగా వాళ్లు సర్ది చెప్పి పంపించగా గోదావరిఖనికి వచ్చింది.తిరిగి ఈ నెల 27 న మళ్లీ గొడవ జరిగిందన్నారు.ఈ క్రమంలో భార్య భర్తలు అదే కాలనీ కి చెందిన చిలుముల శివ రిసెప్షన్ కు వెళ్లి రాత్రి ఒంటి గంటకు వచ్చిన సమయంలో కుమారస్వామి ఇంటి ముందు ఇరువురికి గొడవలు జరిగాయి .అక్కడ ఉన్నవారు కుమారస్వామి కిటికీ లోంచి చూడగా లలిత ఉరివేసుకొని కనిపించింది.స్ధానికం ఉన్నవారు తలుపు తట్టగా కుమారస్వామి తలుపు తీశాడు .అప్పటికే నైలాన్ తాడుతో లలిత పై కప్పుకు ఉరి వేసుకొని మృతి చెందింది. శారీరక ,మానసిక వేధింపులతో లలిత మృతికి కారణమైన కుమారస్వామి పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మృతురాలి తల్లి మాడుగుల శారద పిర్యాదు మేరకు 80 బి ఎన్ ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి ఏ సి పి మడత రమేశ్ సీఐ ఇంద్రసేన రెడ్డి ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :