Thursday, 30 July 2026 02:05:06 PM

రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు : 1టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి హెచ్చరిక

Date : 07 November 2025 08:04 PM Views : 2014

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : గోదావరిఖని 1 టౌన్ పోలీస్‌ స్టేషన్ లో రౌడీషీటర్లకు సీఐ ఇంద్రసేన రెడ్డి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు తమ పద్ధతులు మార్చుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రజాశాంతికి విఘాతం కలిగించే ఏ వ్యక్తినీ పోలీస్‌ శాఖ సహించదని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, గొడవలకు, దాడులకు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కౌన్సెలింగ్‌లో రౌడీషీటర్ల ప్రస్తుత జీవనశైలిని పరిశీలించి, సత్ప్రవర్తన కనబరుస్తున్న వారిపై రౌడీషీట్లు తొలగించేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై గట్టి నిఘా కొనసాగిస్తామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ భూమేష్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :