Saturday, 01 August 2026 01:19:44 AM

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య....

Date : 06 March 2025 12:48 PM Views : 985

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా గోపాల్ వాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కన్నవేణ రాజమణి (35) అనే వివాహిత గత కొన్ని రోజులుగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇంట్లో ఎవరు లేని సమయంలో హాలులో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందిందని మంచిర్యాల పట్టణ ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజమణికి భర్త సతీష్, ఇద్దరు పిల్లలు సాయి కీర్తన, సాయి వినయ్ ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :