ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : పుష్ప 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ నెల డిసెంబర్ 4 వ తేదీన ఆర్టీసీ క్రాస్‌రోడ్ లోని సంధ్య థియేటర్‌లో రాత్రి ఏర్పాటు చేసిన బెనిఫిట్ షో కు అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తన అభిమాన హీరో అల్లు అర్జున్ ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో ఈ తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) గాయాలైన విషయం తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హీరో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే నమోదు చేయగా.. తాజాగా ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు.
Admin
Aakanksha News