Thursday, 30 July 2026 02:37:50 PM

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి...

Date : 14 March 2025 01:14 PM Views : 413

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన విషాదకర సంఘట జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్వరపల్లికి చెందిన మిద్దవేని రవి (52) అనే రైతు డిపిఎం 38 కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశారనే తెలియడంతో పంట చేనుకు నీరు పెట్టడానికి ఎస్సారెస్పీ కాల్వపై కరెంటు మోటరు బిగించాడు.అయితే సాగునీరు రాకపోవడంతో కాలువలో దిగి చెత్తా చెదారం తీసి వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంట తడి పెట్టించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :