Thursday, 30 July 2026 12:33:00 PM

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య....

జయశంకర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామంలో విషాదం....

Date : 15 April 2025 01:09 PM Views : 645

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య(59) అనే రైతు వేసిన పంటలు ఎండిపోయి సరైన గిట్టుబాటు ధర లేక అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో జగ్గయ్యపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :