ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందారంలో జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. 2019వ సంవత్సరంలో నజీరుపల్లికి చెందిన ముష్కె మహేష్ తో శృతి కి పరిచయం ఏర్పడింది. దీంతో వారి ఇద్దరు ప్రేమించుకున్నారు. తర్వాత అతని ప్రవర్తన నచ్చక శృతి అతనిని ప్రేమించడం మానేసి, మాట్లాడటం ఆపేసి దూరం పెట్టింది. దీంతో అప్పటి నుండి మహేష్, శృతి ప్రేమించుకున్నపుడు చనువుగా దిగిన ఫోటోలని ఆమెకు చూపించి ఫేస్ బుక్,ఇంస్టాగ్రామ్ లో పెడతానని బెదిరించేవాడు. ఈ విషయం శృతి తండ్రి కనకయ్య కు తెలిసి మహేష్ ను మందలించిన కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదు. తర్వాత తేదీ 13.06.2022 న మహేష్ శృతి న్యూడ్ వీడియో రికార్డును ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. దీంతో మహేష్ పై జైపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే సోషల్ మీడియాలో వచ్చిన శృతి యొక్క న్యూడ్ వీడియోలు చూసి అవమానంతో శృతి భర్త తేదీ 28.09.2022 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇట్టి విషయంలో సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో PS లోCr.No 259/2022 U/Sec 174 Cr.P.C కేసు నమోదు అయింది. దీంతో మహేష్ వల్ల తన కూతురు జీవితం నాశనం అయిందని, కూతురు భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, ప్రతి రోజు అతను కనకయ్య ఇంటి ముందుకు వచ్చి బైక్ హారన్ కొడుతూ మానసికంగా వేధించడంతో ఎలాగైనా మహేష్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కనకయ్య ,భార్య పద్మ కూతురు శృతి, కొడుకు సాయిలు మహేష్ వారి ఇంటి ముందు నుండి వెళ్ళేటపుడు అడ్డగించి అతన్ని కత్తితో పొడిచి చంపాలని అనుకున్నారు. అందుకోసం గత పది రోజుల క్రితం గోదావరిఖని వెళ్లి కత్తులు తయారు చేసే షాప్ లో ఒక కత్తి కొనుక్కొని వచ్చాడు. అయితే ఎప్పటిలాగే ఈ నెల 25 వ తేదీన ఉదయం 08:30 గంటల ప్రాంతంలో మహేష్ నిందితుల ఇంటి ముందు నుండి ఇందారం బస్ స్టాండ్ వైపు హారన్ కొట్టుకుంటూ వెళ్ళాడు. అతను ఎలాగైనా ఇదే దారిలో వస్తాడని వీరు అనుకున్న ప్లాన్ ప్రకారం మహేష్ వచ్చేది గమనించి కనకయ్య కొడుకు సాయిలు ఇంటి ముందు నుండి బైక్ పై వస్తున్న మహేష్ ని ఆపి కనకయ్యని పిలువగా తను వెళ్లి మహేష్ టీ-షర్ట్ పట్టుకుని లాగగా అతను పారిపోయే ప్రయత్నం చేయడంతో కనకయ్య భార్య, కూతురు శృతి కొడుకు సాయి అందరూ కలిసి మహేష్ ను కత్తితో సిమెంట్ ఇటుకతో కొట్టగా బలమైన రక్త గాయాలు అయి మహేష్ అక్కడికి అక్కడే మృతి చెందాడు.వీరు ఇంట్లో ఉంటే మహేష్ తరుపు వారు దాడి చేస్తారని, పోలీసులు పట్టుకుంటారని కనకయ్య, పద్మ ,ఇద్దరు కూతుర్లు శృతి, శ్వేత,కొడుకు సాయి లు అక్కడి నుండి పారిపోయారు. నిందితులను పట్టుకోవడానికి జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేశారు. దానిలో బాగంగా నమ్మదగిన సమాచారం మేరకు నిందితులు నేరం చేసిన తరువాత మంథని వైపు వెళ్లి అక్కడ అక్కడ తిరుగుతూ గురువారం ఇందారంలోని వారి ఇంటికి వచ్చి వారి యొక్క బట్టలు,డబ్బులు తీసుకొని ఎవరికి కనపడకుండా వెళ్లాడానికి ఉదయం 05:30 గంటలకు షెట్ పల్లి X రోడ్ వద్ద ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని జైపూర్ ఏసిపి వెల్లడించారు. వారి నుండి ఒక కత్తి,నేరస్తుడు వాడిన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈసమావేశంలో శ్రీరాంపూర్ సీఐ రాజు, జైపూర్ ఎస్సై పాల్గొన్నారు.
Admin
Aakanksha News