Friday, 31 July 2026 06:53:11 PM

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు...

Date : 16 September 2025 12:57 PM Views : 940

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : గోదావరిఖని పట్టణంలో వరుస దొంగతనాలతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న డిగ్రీ విద్యార్థి కవ్వంపల్లి అరుణ్‌కుమార్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం గురించి పెద్దపల్లి జిల్లా డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు తెలియజేశారు.డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం… స్థానికంగా డిగ్రీ చదువుతున్న అరుణ్‌కుమార్ వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి ఖర్చుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రి వేళల్లో చోరీలకు దిగేవాడు. ఇటీవల పట్టణంలో జరిగిన మూడు దొంగతనాల కేసుల్లో ఈయనే నిందితుడని పోలీసులు గుర్తించారు.అరెస్టు సమయంలో నిందితుడి వద్ద నుంచి 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేసి, అరుణ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వివరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :