Friday, 31 July 2026 05:23:13 PM

కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ ట్రాలీ అదుపుతప్పి బోల్తా...

ముగ్గురి పరిస్థితి విషమం.. 13 మందికి గాయాలు...

Date : 22 March 2025 11:04 AM Views : 575

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంథని : కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడటంతో వాహనంలో ఉన్న మొత్తం 16 మంది మహిళలలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా 13 మందికి గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంథనిలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మల్లారంలో మిర్చి ఏరేందుకు రోజులాగే శనివారం కూడా టాటా ఏస్‌ వాహనంలో వెళ్తున్న క్రమంలో మంథని- కాటారం ప్రధాన రహదారిపై నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ట్రాలీ స్టీరింగ్ ఉడిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలను స్థానికుల సహాయంతో పోలీసులు చికిత్స మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :