Thursday, 30 July 2026 02:55:59 PM

నెల్లూరు జిల్లాలో దొంగలు బీభత్సం...

సిగ్నల్‌లో సాంకేతిక సమస్య సృష్టించి బెంగళూరు ఎక్స్‌ప్రెస్, చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపి దోచుకున్న దొంగలు

Date : 02 April 2025 07:59 PM Views : 667

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నెల్లూరు జిల్లా : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సాంకేతిక సమస్య సృష్టించి మరీ.. అల్లూరు రోడ్డు-పడుగుపాడు స్టేషన్ల మధ్య ప్రయాణికులను దోచుకున్నారు. సిగ్నల్‌లో సాంకేతిక సమస్య సృష్టించి బెంగళూరు ఎక్స్‌ప్రెస్, చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపిన దొంగలు ఇష్టారాజ్యంగా దోపిడికి పాల్పడ్డారు. బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-4, ఎస్-5, భోగీల్లో మహిళల మెడలోని బంగారం దోచుకెళ్లిన దొంగలు, పడుగుపాడు వద్ద మరికొందరి నుంచి బంగారం దోచుకున్నారు.ఒక చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-2, ఎస్-3, ఎస్-5 భోగీలలో నగలతో పాటు బ్యాగ్‌లను కూడా అపహరించుకుపోయారు. ఆర్‌పిఎఫ్, జిఆర్పి బృందాలు నిర్లక్ష్యం వల్లే ఈ దోపిడి జరిగిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. అల్లూరు స్టేషన్‌లో సిసిటివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :