ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : తన కొడుకు అక్రమ సంబంధమే తండ్రి దారుణ హత్యకు దరి తీసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో చోటు చేసుకుంది... వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై అరా తీశారు.నండిపల్లి గ్రామానికి చెందిన దూరం వీరయ్య(50)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే సదురు మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవలే వీరయ్య కుమారుడు ఆమెను తీసుకొని ఏపీలోని గురజాలకు వెళ్లాగా మహిళ కుటుంబ సభ్యులు వారిని నడింపల్లికి తీసుకొని వచ్చారు. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న వీరయ్య కుమారుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. దీంతో తమ కుమారుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పథకం ప్రకారం అచ్చంపేట నుంచి నడింపల్లికి వస్తుండగా కారుతో ఢీకొట్టి వీరయ్యను కత్తులతో నరికి చంపారు. అక్కడే ఉన్న వీరయ్య పెద్ద కుమారుడు తప్పించుకున్నాడు. వీరయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Admin
Aakanksha News