Friday, 31 July 2026 01:09:54 PM

బెదిరింపులకు పాల్పడి.. డబ్బులు వసూళ్లు చేస్తున్న విలేకరి అరెస్ట్...

నేడో రేపో బయటపడనున్న మాయల మాంత్రికుడి బాగోతాలు...

Date : 24 September 2024 01:39 PM Views : 1126

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : గత కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతూ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న విలేకరిని చెన్నూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. చెన్నూర్ కు చెందిన కనుకుంట్ల వెంకట్రారాజ్ అనే వ్యక్తి ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. NGOS కాలనీకి చెందిన రాజేశం ఇంటిని సుందర్ అనే వ్యక్తికి కిరాయికి ఇవ్వగా అద్దె చెల్లింపుల విషయంలో వారి మధ్య ఈ నెల 17వ తేదీన గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రిపోర్టర్ వెంకట్రారాజ్ రాజేశం కు ఫోన్ చేసి నీపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించక 5వేల రూపాయలు ఫోన్ పే చేశాడు. అలాగే బొమ్మ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తన పొలంలో మొరం తవ్వుతు ఉండగా అక్రమంగా మొరం తరలిస్తున్నావని చెప్పి బెదిరించి విడతలవారీగా 25వేల 500 రూపాయలను వసూళ్లు చేశాడు. దీంతో పాటు పండ్ల వ్యాపారి నాయిని తిరుపతిని అక్రమ కట్టడం నిర్మిస్తున్నావని చెప్పి 31వేల రూపాయలు, గుర్రం సుధాకర్ అనే చికెన్ సెంటర్ నిర్వాహకుడి వద్ద అక్రమ కట్టడం నిర్మిస్తున్నావని చెప్పి 5వేల రూపాయలను వసూలు చేశాడు. ఇలా అమాయక ప్రజలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న విలేకరిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు చెన్నూర్ పోలీసులు ప్రకటనలో తెలిపారు.

నేడో రేపో బయటపడనున్న మాయల మాంత్రికుడి బాగోతాలు...

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి ఉద్యోగాల పేరుతో, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఓ మాయగాడి లీలలు నేడు రేపో బయటపడనున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :