Sunday, 26 April 2026 06:44:04 PM

సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి...

Date : 04 October 2024 05:02 PM Views : 330

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : సీజనల్ వ్యాదుల పట్ల పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిఎల్పివొ కొమ్మెర సతీష్ కుమార్ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ కుమార్ దుబ్బపల్లి గ్రామపంచాయతీలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సీజనల్ వ్యాదుల పట్ల పంచాయతీ కార్యదర్శికి తగు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ఇంటింటా చెత్త సేకరణ జరగాలని ఎస్ డబ్ల్యు ఎమ్ షెడ్ లో సెగ్రిగేషన్ ప్రక్రియ జరిగి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని, ప్లాస్టిక్, డ్రైవ్ వేస్ట్ ను అమ్మిన రొక్కమును గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయాలన్నారు. అక్టోబర్ 15 లోపు ఇంటి పన్నులు వసూళ్లు పూర్తి చేయ్యాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం జరగాలని, పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తె చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రేణుక,సిబ్బంది ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :