Saturday, 13 June 2026 02:44:03 PM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థినీలు...

Date : 20 September 2025 06:33 PM Views : 305

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటేందుకు ఎంపికై సత్తా చాటారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఉత్కపల్లికి చెందిన ఆళ్ల శరణ్య రెడ్డి, ఉడుత శ్రీవల్లి ఎంపిక కావడం పాఠశాల వర్గాలను ఆనందంలో ముంచెత్తింది.ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ ఇద్దరు విద్యార్థినులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించి కుటుంబానికి, పాఠశాలకు, గ్రామానికి పేరుప్రతిష్టలు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం సాంబయ్య, పీడీ హరికృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని శరణ్య, శ్రీవల్లిని అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :