ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ఎక్లాస్ పూర్, గంగాపురి లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొత్త శ్రీనివాస్ ప్రారంభించగా ఖానాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘ డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్, శ్రీపాద కాలనీ లో డైరెక్టర్ దాసరి లక్ష్మీ, అంగులూర్ కేంద్రాన్ని డైరెక్టర్ లెక్కల కిషన్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగిందన్నారు. సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఇందులో భాగంగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా,సన్న వడ్లకు రూ.500బోనస్ అందిస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అందరు సమన్వయంతో పనిచేసి ధాన్యాన్ని తూకం వేయించి రైస్ మిల్లులకు తరలిస్తూ వెనువెంటనే ట్యాబ్ లో ధాన్యం వివరాలు నమోదు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. గత సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా సన్న వడ్లకు బోనస్ చెల్లింపు చేయడం జరుగుతుందన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, ఆకుల రాజ బాబు, కొత్త శ్రీనివాస్, దేవళ్ళ విజయ్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్లి రమ సురేష్ రెడ్డి, నాయకులు పేరవేన లింగయ్య, మూల పురుషోత్తం రెడ్డి, అజీంఖాన్, కుడుదుల వెంకన్న,గుండా పాపారావు, ఆకుల శ్రీనివాస్, బూడిది శంకర్, ఊట్ల అనిల్, పెండ్లి ప్రభాకర్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్,ఆర్ల నారాయణ, బూడిద రంజిత్, రాధారపు నితీష్, జంజర్ల శైలేందర్, అర్థం సదానందం, నాంపెల్లి సతీష్, నల్ల రాజశేఖర్, దొరగొర్ల శ్రీనివాస్, సేమంతుల ఓదెలు, బాస అశోక్,పుట్ట శంకరయ్య, పెంటరి రాజు,ఎరుకల రమేష్, నామని సుగుణ, లైసెట్టి రాజు, ఎరుకల ప్రవీణ్, సాదుల శ్రీకాంత్, కొట్టె రమేష్, సహకార శాఖ మానిటరింగ్ అధికారి పి. సురేందర్ రెడ్డి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Aakanksha News