ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకుంటె సమ్మెకు సిద్దంగా ఉన్నట్లు ఆర్టీసి జెఏసి ఛైర్మన్ ఐలయ్య, కన్వీనర్ కెకె రెడ్డిలు పేర్కొన్నారు. ఆర్టీసి జెఏసి పిలుపు మేరకు మంథని బస్ డిపో సమీపంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి సిద్దం సిద్ధం నమ్మెకు సిద్ధం అంటు నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఆర్టీసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, 2021 పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడంలో జాప్యం చేస్తుందని, యాజమాన్యం కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండ తక్కువ వేతనాలతో పని చేయించుకుంటూ కాలయాపన చేయడం తగదన్నారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ నెల 6 వరకు తమ డిమాండ్ల పరిష్కారం కాకుంటే 7 ఉదయం నుండి సమ్మెలోకి దిగడం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఏసి కో ఛైర్మన్ ఎడ్ల రమేష్, కో కన్వీనర్లు ఎస్ సదయ్య, కృష్ణ, జనార్దన్, ఖుతుబుద్దీన్, ఎం పోచయ్య, జేడి నాయక్, ఇంతియాజ్, ఎం ప్రభాకర్, కోశాధికారి, మీడియా కన్వీనర్ ఎండి మునీర్, ప్రచార కార్యదర్శులు కె రాజు, విజేందర్, ఎన్ రాజయ్య, బి గోపాల్, పి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News