ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనె చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి రామగిరి ఎంపిడిఓ శైలజ రాణీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ముప్పిడి నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు తమ సమస్యలు పరిష్కారం కోసం రామగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టి వినతి పత్రం అందజేశామన్నారు. మూడు నెలల పెండింగ్ వేతనాలు, మేనిపేస్టోలో పెట్టిన ప్రకారంగా ఎఫ్ టిఈ, పేస్కేల్, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డుల ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెరవేణి కొమరయ్య, ఎంజాల సతీష్, కన్నూరి రాజయ్య, ఎడ్లపల్లి సంపత్, సందవేన జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News