Thursday, 30 July 2026 02:38:44 PM

మోడీని విమర్శించిన కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది... రేవంత్ రెడ్డి తన ఓటమిని నిన్ననే అంగీకరించాడు...

కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి బిజెపి అభ్యర్థులను గెలిపించండి... బిజెపి మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్...

Date : 25 February 2025 05:04 PM Views : 747

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు పట్టిన గతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పడుతుందని బిజెపి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బిజెపి పార్టీ నాయకురాలు రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.... ఒక పార్టీ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి పోటీలో లేకుండా పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే 317 జీవోను సవరిస్తామని మీడియా సమావేశంలో తెలియజేయాలని ప్రశ్నించారు. సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీపై పోరాడేది బిజెపి పార్టీ ఒకటే అని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఛీ కొట్టడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డిని మాత్రం చీకొట్టడానికి ఒక సంవత్సరమే పట్టిందని ఘాటుగా విమర్శించారు. సింగరేణి నేను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కారణమని ఇప్పుడు అదే బాటలో రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో బిజెపి జెండానే ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని బిజెపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టుభద్రుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బిజెపి పార్టీ ఎప్పుడు ముందుండి కొట్లాడుతుందన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :