ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురిచేసిన గోదావరిఖని మమత హాస్పిటల్ యజమాన్యం, వైద్యులు,సిబ్బందిపై కేసులు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల 26న జిల్లా వైద్యాధికారి డా. జి. అన్న ప్రసన్న కుమారి విధి నిర్వహాణలో బాగంగా గోదావరిఖని మమత హాస్పిటల్ తనిఖీ చేయాగా అందులో అనుమతిలేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను గుర్తించారని తెలిపారు. చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ కలిగి ఉండడం నేరమని తన విధి ప్రకారం చర్యలు తీసుకొనుచుండగా వైద్యులు నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారని అన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని నానా విధాలుగా బెదిరించిన డాక్టర్లపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు మహాంకాళి స్వామి, అతని అనుచరులు, హాస్పిటల్ యజమాన్యం, రిసెప్షనిస్ట్ ఆనంద్ ద్వారా అధికారినిపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ, పెద్దపల్లి అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ సంకంపల్లి లక్ష్మయ్య, కట్కూరి సందీప్, కొంకటి లింగమూర్తి, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల కన్వీనర్లు బుసెల్లి నారాయణ, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News