Thursday, 30 July 2026 01:34:28 PM

సమస్యాత్మక ప్రాంతాలను ఆకస్మికంగా అర్ధరాత్రి తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్

Date : 13 March 2025 06:23 AM Views : 598

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలో సమస్య ఆత్మక ప్రాంతాలను రామగుండం పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు జీవనోపాధి కోసం ఒడిశా బీహార్, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్, చత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుండి వచ్చి సింగరేణి, ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం, పవర్ ప్లాంట్లలో పనిచేస్తూ ఉంటారు. అయితే వారి యొక్క జీవనశైలి ఇలాంటి ప్రదేశంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబటి కిషోర్ ఝా అర్ధరాత్రి సిబ్బందితో కలసి సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్, 7ఎల్ఈపీ, 5 ఇంక్లైన్, సి ఎస్ పి ఏరియాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రదేశాలలో బొగ్గును అక్రమంగా తీసుకోవడం గంజాయిని సేవించడం దొంగిలించడం ఇనుప వస్తువులను సింగరేణి సంబంధించిన వాటిని దొంగిలించడం లాంటి చేస్తూ ఉంటారు. అలాంటి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం కోసం డీసీపీ, గోదావరిఖని ఏసిపి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా తిరిగి ఇక్కడ ప్రాంతాల గురించి అడిగి తెలుసుకుని ఇక్కడ జరిగే చట్టావ్యతిరేకమైన చర్యల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనర్ వెంట పెద్దపల్లి డిసిపి పి కరుణాకర్, గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ లింగమూర్తి గోదావరిఖని సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :