Sunday, 26 April 2026 05:36:31 PM

అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి..

బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్...

Date : 13 December 2025 06:45 AM Views : 230

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు.బీఆర్ఎస్ మద్దతు పొందిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈశ్వర్ పెద్దపెల్లి జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ తో కలిసి ధర్మారం మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మారం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి తుమ్మల రాంబాబు మానసకు, కొత్తూరులో బానోతు రాజేశ్వరి రాజేశం నాయక్కు ఆయన మద్దతు ప్రకటించారు.ప్రచార కార్యక్రమం అనంతరం ఈశ్వర్ ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆయన అక్కడే ప్రజలకు ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నిరాశపరచినట్టు వివరించారు.మాజీ మంత్రి ఈశ్వర్ స్పష్టంగా చెప్పినట్టుగా, “ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ హామీలను గుర్తుంచుకుని, నిజాయతీతో పనిచేసే బీఆర్ఎస్ మద్దతు పొందిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :