Thursday, 30 July 2026 02:04:35 PM

సింగరేణి నిరాహార దీక్షకు అనుమతి లేదు...

టెంట్ ను తీసివేయడంతో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు...

Date : 06 October 2024 12:18 PM Views : 895

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణికి వచ్చిన నికర లాభాల్లో 33శాతం లాభాల వాటాను కార్మికులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని చౌరస్తాలో సింగరేణి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. అయితే ఈ దిక్ష కార్యాక్రమానికి ఎటువంటి అనుమతి లేదని పోలీసులు టెంట్ ను తొలగించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తోపులట జరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అనుమతి లేదనే పేరుతో పోలీసులు దీక్షను భగ్నం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. దీంతో అక్కడే పార్టీ శ్రేణులు, నాయకులు ఆందోళనకు దిగారు. అనంతరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో సింగరేణి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :