Thursday, 30 July 2026 11:12:33 AM

రోడ్డు వెడల్పు లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదు....

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్ జే.అరుణశ్రీ...

Date : 05 April 2025 02:24 PM Views : 595

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం గోదావరిఖని రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదని స్థానిక సంస్థల అదనప కలెక్టర్, రామగుండం ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్ జే.అరుణశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరిఖని బస్టాండ్ చౌరస్తాలో రోడ్డు వెడల్పులో అంబేద్కర్ విగ్రహం తొలగిస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు ఎవరు ఇటువంటి అపోహలను నమ్మ వద్దని, రోడ్డు వెడల్పులో విగ్రహాల తొలగింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, ప్రజలు అనవసర ఆందోళనకు గురి కావద్దని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :