Thursday, 30 July 2026 12:32:04 PM

ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులను నింపాలి....

ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు..సీఐ ఇంద్రాసేనా రెడ్డీ

Date : 31 October 2024 12:08 AM Views : 503

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు...ఈ దీపావళి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సూచించే జాగ్రత్తలు, సూచనలు పాటించాలని గోదావరిఖని ఒక్కటవ పట్టణ సీఐ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మీరు మీ కుటుంబ సభ్యులతో టపాసులు కాలుస్తున్నప్పుడు కచ్చితంగా దూరాన్ని కనీసం రెండు మీటర్లు దూరంగా ఉండేటట్టు చూసుకోవాలన్నారు. చిన్న పిల్లలను టపాసులు కాల్చే ప్రదేశానికి దూరంగా ఉంచాలని సూచించారు.ఎక్కువ శబ్దం వచ్చే టపాసులను కాల్చడం వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడి చిన్న పిల్లలకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుందని .కాబట్టి అలాంటి టపాసులను కాల్చరాదని అన్నారు. టపాసులు కాలుస్తున్న సందర్భంలో చుట్టుపక్కల తొందరగా అంటుకునే వస్తువులు కానీ, గుడిసెలు కానీ... ఏవైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు ఉంటే జాగ్రత్తలు పాటించాలన్నారు. టపాసులు కాలుస్తున్న సందర్భంలో మీ బట్టలు అంతుకుని, దానివల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మీరు టపాసులు కాలుస్తున్న ప్రదేశంలో ఖచ్చితంగా వాటర్ ఇసుక ఉండే విధంగా చూసుకోవాలన్నారు.ముఖ్యంగా మీరు ఈ పండుగకి గోదావరిఖని నుండి మీ ఇంటికి గాని, మీ బంధువుల ఇళ్లకు కానీ లేదా వెళుతున్నప్పుడు మీ ఇంటికి తాళాలు జాగ్రత్త వేసుకోవాలని ఏవైనా విలువైన వస్తువులు, డబ్బు కానీ, బంగారాభరణాలు కానీ, ఇతర వస్తువులు ఉన్నట్లయితే వాటిని మీ వెంట తీసుకువెళ్లాలి లేదా లాకర్లో జాగ్రత్తగా దాచుకోవాలని తెలిపారు. అలాగే మీ ఇంటికి తాళం కి సంబంధించిన సమాచారం మీ పక్క ఇంటి వారికి కానీ, పోలీసు వారు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నట్లయితే అట్టి సీసీ కెమెరాలు సర్వేలెన్సు అనేది మీ ఫోన్లో వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు తిరుగుతున్నట్లయితే అట్టి వ్యక్తులకు సంబంధించిన సమాచారం పోలీసువారికి వెంటనే తెలియజేయాలన్నారు.ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ.. మరొకసారి పోలీస్ శాఖ తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :