Friday, 31 July 2026 12:27:42 PM

కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు...

Date : 30 October 2024 10:32 AM Views : 796

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకు కుక్కల బెడత పెరిగిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కలు పలువురు పై దాడి చేస్తూ ఉండడంతో తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చేరుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.... రామగుండం మసీద్ కార్నర్ వద్ద మూడు సంవత్సరాల బాలుడు తన ఇంటి సమీపంలో బహిర్ భూమికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చి కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :