Thursday, 30 July 2026 12:41:47 PM

భారతీయ జనతా పార్టీ అభివృద్దే లక్ష్యంగా పని చెయ్యాలి.

Date : 15 March 2025 06:59 PM Views : 479

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డిని రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులు చుక్కల రాములు యాదవ్, గోగుల రవీందర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కర్రు సంజీవరెడ్డిలు మాట్లాడుతూ... రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్తతో కలిసి మెలిసి పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అబద్దాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయన్నారు సందర్భంగా చుక్కల రాములు యాదవ్ మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయించిన మేరకు పార్టీ క్రమశిక్షణతో పాటు రామగుండం నియోజకవర్గం లో పార్టీ అభివృద్ధి కోసం తమ శ్రేయ శక్తులకు చేస్తామన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :