ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఓ భారీ జెసిబి యంత్రం కాలువలో పడిపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... సీతనగర్ కూరగాయల మార్కెట్ వద్ద పైపులు తీసివేసి మేదర్ బస్తీ నుండి తిరుమల నగర్ వైపు వెళ్తుండగా జేసీబి మార్కెట్ వద్ద రోడ్డు ఒక్కసారిగా కూలిపోవడంతో కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శేఖర్ తో పాటు పక్కనే ఉన్న వెంకట్ అనే ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో గాయపడిన ఇద్దరిని 108 ద్వారా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
Aakanksha News