Friday, 31 July 2026 02:15:03 PM

కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కుట్రలు చేస్తున్న బిజెపి పార్టీ...

మూతపడిన పత్రిక పై రాజకీయం చేస్తున్న హోం మంత్రి అమిత్ షా... కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్

Date : 16 April 2025 10:06 PM Views : 405

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, తిప్పారావు శ్రీనివాసులు ఆరోపించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... 1938లో నెహ్రు స్థాపించిన నేషనల్ హైరాల్డ్ పత్రిక ఆర్థిక ఇబ్బందులతో 2008లో మూతపడడం జరిగిందని కానీ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసును 2012లో బిజెపి నాయకులు సుబ్రహ్మణ్యస్వామి వేసి గత 12 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ సోనియా గాంధీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారన్నారు. వారిని ఇరకాటంలో పెట్టే అందుకే బిజెపి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమీషా మూతపడిన పత్రికపై రాజకీయం చేస్తూ నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ పేరును చార్జిషీట్ లో చేర్చి బిజెపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపడం జరుగుతుందని మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి బాలరాజు, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :