Saturday, 13 June 2026 02:47:39 PM

ఘనంగా గోదా దేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం

Date : 13 January 2025 07:19 PM Views : 466

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా గోదా దేవి రంగనాయక స్వామి కళ్యాణం కన్నుల పండుగ వేదమంత్రాలు మధ్యన జరిగింది భోగి పండుగను పురస్కరించుకొని సోమవారం భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రధాన పూజారి బూర్ల గణేష్ అయ్యవారి ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీరాముల అయ్యగారు నూతి అంబాదాసు అయ్యగారు వేద పండితుల మధ్య గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం కమనీయం అనే రీతిలో అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా రంగనాథ స్వామి దీవెనలు అందుకొని వారి పిల్లలు కుటుంబాలు వారు నివసిస్తున్న ప్రాంతాలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేవిధంగా గోదా రంగనాథ స్వామి దీవించాలని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దాట్ల జేమ్స్ రెడ్డి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ కార్పొరేషన్ నాయకులు మొలుగూరి మహేష్ గొర్రె నర్సింగరావు భక్తివాసులు ఉప్పరి మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :