ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేస్) నాయకులను లక్ష్యంగా చేసుకొని కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి,టీబీజీకేస్ ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ సందర్బంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టీబీజీకేస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సింగరేణిలో 9 నెలల విరామం తర్వాత జూలై 30, 31 తేదీలలో నిర్వహించిన మెడికల్ బోర్డు సమావేశంలో పిలిపించిన 55 మంది ఉద్యోగుల్లో కేవలం ఐదుగురిని మాత్రమే అన్ఫిట్‌గా ప్రకటించడం దారుణమని టీబీజీకేస్ ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మైనింగ్ స్టాప్ సోదరులకు సూటబుల్ జాబ్ పేరుతో జనరల్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమించడం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 100% అన్ఫిట్‌లకు ఉద్యోగ భరోసా ఇవ్వాలని హామీ ఇచ్చారని, కానీ మెడికల్ బోర్డులో 80% నుండి 90% వరకు మాత్రమే ఇన్వాల్యుయేషన్ జరగడం వల్ల కారుణ్య నియామకాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ ఒత్తిడితో ట్రాన్స్ఫర్ అయిన టీబీజీకేస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, జావిద్ పాషా, నూనె కొమురయ్యల బదిలీలను వెంటనే రద్దు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.మందమర్రి ఏరియాలో జరిగిన ప్రమాదంలో ఎస్డిల్ యాక్టింగ్ ఆపరేటర్ రాచపల్లి శ్రావణ్ కుమార్ మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రక్షణ కమిటీ సమావేశాలు జరగకపోవడం, యాజమాన్యం శ్రద్ధలేమి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.ఎన్నికల ముందు 100% అన్ఫిట్ చేస్తామని AITUC, INTUC నాయకులు హామీ ఇచ్చి కార్మికులను మోసం చేశారని ఆరోపిస్తూ, ఇటీవల జరిగిన మెడికల్ బోర్డును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకంటి చందర్, పుట్ట మధు, మిర్యాల రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, మాదాసు రామ్మూర్తి, నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, మేడిపల్లి సంపత్, చెల్పూరి సతీష్, మాకు రమేష్, అన్వేష్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, ముదంనపల్లి రాజేశం, ఇందురి సత్యనారాయణ, చిలకలపల్లి శ్రీనివాస్, చల్లా రవీందర్ రెడ్డి, దూట శేషగిరి, కొండ్ర అంజయ్య, వాసార్ల జోసెఫ్, బొడ్డు రమేష్, రొడ్డ సంపత్, పులిపాక శంకర్, మీసరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News