Thursday, 30 July 2026 04:14:23 PM

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి....

క్యూరింగ్ కోసం నీళ్లు కొడుతుండగా విషాదం...

Date : 15 October 2025 12:55 PM Views : 1295

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్‌ వద్ద బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. నూతన ఇంటి నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.వివరాల్లోకి వెళ్తే... పట్టణానికి చెందిన వెలిచాల రమేష్‌ ఇటీవల తన కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. అయితే ఇంటి క్యూరింగ్ కోసం నీళ్లు కొడుతున్న సమయంలో విద్యుత్ వైరు తగలడంతో రమేష్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు.దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గమనించి విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రమేష్‌ మరణంతో స్థానికుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :