Thursday, 30 July 2026 10:55:06 PM

శ్రీపాద రావు సేవలు మరువలేనివి...

Date : 13 April 2025 01:13 PM Views : 327

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు రాష్ట్రానికి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చేసిన సేవలు మరువలేనివి అని పెద్దపల్లి, సుల్తానాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎల్. రాజయ్య, గాజుల లక్ష్మీ రాజమల్లు అన్నారు. శ్రీపాద రావు వర్ధంతిని పురస్కరించుకుని పెద్దపల్లి మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో ఆదివారం కరీంనగర్ బస్టాండ్ వద్ద శ్రీపాద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీపాద రావు చేసిన సేవలను కొనియాడారు. శ్రీపాద రావు ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘం నాయకులు తూముల శ్రీనివాస్, ఆకుల వివేక్ స్వామి, మంథని మాజీ మార్కెట్ ఛైర్మన్ ఆకుల కిరణ్, కొట్టె రమేష్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :