Saturday, 01 August 2026 12:28:22 AM

ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలి...వ్యాల హరీష్ రెడ్డి

19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు చేయూత....

Date : 24 July 2025 12:50 PM Views : 636

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఆర్థిక చేయూత అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన, నిరుపేద కుటుంబానికి చెందిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం కనీసం కనువిప్పు పొందాలని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.తనపై కొంతమంది కుట్రలు పన్ని పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించిన ఆయన... రామగుండంకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.కేటీఆర్ తనకు మార్గదర్శకుడని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనేక మందికి విద్యా సహాయం అందిస్తున్నట్లు హరీష్ రెడ్డి వెల్లడించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :