Friday, 31 July 2026 06:33:10 PM

యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.... రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యం

డైరెక్టర్(ఈఅండ్ ఏం) సత్యనారాయణ

Date : 21 January 2025 06:26 PM Views : 453

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో రక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ ఏం) సత్యనారాయణ అన్నారు. మంగళవారం అర్జీ3 డివిజన్ పరిధిలోని ఓసిపి1ను డైరెక్టర్ సందర్శించారు. ముందుగా ఉత్పత్తి సాధనలో భాగంగా తీసుకుంటున్న రక్షణ చర్యలు, నూతనంగా ప్రారంభం కానున్న రామగుండం కోల్ మైన్, ఓసిపి 1 విస్తరణ ప్రతిపాదనలు, సర్వే చేసిన ఏరియా వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుండి పని ప్రదేశాలను, యంత్రాల పని తీరును పరిశీలించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ... ప్రణాళికాబద్ధంగా నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని దిశనిర్దేశం చేశారు.ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలను పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పతికై కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా యాజమాన్యం కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేస్తున్న భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.గనికి నిర్దేశించిన ఉత్పత్తి మరియు రవాణా లక్ష్యాలను సాధించడానికి తగిన చర్యలను చేపట్టాలని సూచించారు. డైరెక్టర్ వెంట ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర్, ఓపెన్ కాస్ట్-1 ప్రాజెక్టు ఆఫీసర్ రాజశేఖర్, ఏరియా ఇంజనీర్ వై‌వి శేఖర బాబు, ప్రాజెక్టు ఇంజనీర్ ఉదయ్ భాస్కర్, డి‌జి‌ఎం(ఈ&ఎం) సి‌హెచ్‌పి కాశీ విశ్వేశ్వర రావు, ఇంచార్జీ మేనేజర్ పి. శ్రీనివాస రావు, సర్వే ఆఫీసర్ యానాది శెట్టి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :