ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : ప్రతిపక్షంలో కూర్చోపెట్టినా ఇంకా దళిత వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు తమ విధానాలను మార్చుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సుతారీ లక్ష్మన్ బాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మంధేన వెంకటేష్ లు అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పవిత్ర దేవాలయంగా భావించి రాష్ట్ర ప్రజల కోసం వారి అవసరాల కోసం చట్టాలు తయారు చేసే పవిత్రమైన శాసన సభ అని అలాంటి శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అగౌరపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి దళితుడు అత్యున్నతమైన స్థానంలో కూర్చోవడం జిర్ణించుకోలేక ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. గతంలో తాము అధికారంలోకి వస్తే దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తామని దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని మోసం చేసిన పార్టీ అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ కదా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికైనా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు శాసన సభను సమర్ధ వంతంగా నిర్వహిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ను టార్గెట్ చేస్తూ వారిని అగౌరవ పరుస్తూ మాట్లాడటం BRS దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలను ఇకనైనా మార్చుకొక పోతే రాష్ట్ర ప్రభుత్వం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు
Reporter
Aakanksha News