ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రజాపాలనంటూ ప్రజల గొంతును నొక్కుతున్న పాలకుల విధానం సరైంది కాదని,ఎన్టీపీసీ భూ నిర్వసీతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ కోసం తమ భూములను త్యాగం చేసిన భూనిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తామని నష్టపరిహారం చెల్లించే వరకు పోరాడుతానని స్పష్టం చేసారు.నూతనంగా నిర్మాణం చేపట్టనున్న 2400 మెగావట్ల పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మంగళవారం ఎన్టీపీసీలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రభావిత ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని ఎన్టీపీసీ పట్టణ బంద్ కు పిలుపునిచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరిగే సభ స్థలానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారని చందర్ తెలిపారు.రామగుండంలోని ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్ట్ దేశానికి వెలుగులు అందిస్తున్నా.. నిర్వాసి తుల కుటుంబాలు జీవితాలను చీకటి మయం చేస్తుందన్నారు. భూ నిర్వసీతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. అలాగే ఎన్టీపీసీలో ముఖ్య భూమిక పోషించిన కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం విస్మరించిందని కార్మికుల పిల్లలకు మేరుగైనా విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ స్టేజ్-2లో చేపట్టే 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం కాలుష్యంగా మారుతుందన్నారు. విలువైన భూములు అందిస్తున్న నిర్వాసితులకు ప్రాజెక్టులో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభావిత, పునరావాస ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించి, మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు. కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు కార్పొ రేట్ స్థాయిలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి ఉచిత వైద్యం అందించాలని డిమాం డ్ చేశారు. కుందనపల్లి, మల్యాలపల్లి, అక్బర్ నగర్, బద్రిపల్లి, మొగల్ హాడ్, మాతంగి కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.పవర్ ప్రాజెక్టు కింద భూములు త్యాగం చేసి సర్వస్వం కోల్పోయిన భూ నిర్వాసితులను ఎన్టీపీసీ యజమాన్యం బెదిరింపులకు గురిచేస్తుందన్నారు. తక్షణమే భూనిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో తాజా మాజీ కార్పోరేటర్లు కన్నూరి సతీష్ కుమార్,ముదాం శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, నల్ల వెంకటరమణ రెడ్డి, పెంట రాజేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లి, శ్రీనివాస్,బొడ్డు రవీందర్, అచ్చే వేణు మెరుగు పోచం, బండారి ప్రవీణ్, కొల్లూరు సతీష్, సందెల మల్లయ్య, కొల్లూరి శరణ్య, మధుకర్ రెడ్డి, పల్లె శ్రీనివాస్, బండారి శ్రీవాణి, కిరణ్,రానాపూర్ శ్రీనివాస్, గిట్ల లక్ష్మారెడ్డి నిజాముద్దీన్, చిలుక ప్రసాద్, చిలుక శంకర్, నాంసాని శంకర్, తదితరులు ఉన్నారు
Reporter
Aakanksha News