ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గత నెల 27 వ తేదీన అంతర్గాం జెడ్పీ స్కూల్ లో నిర్వహించిన పోలింగ్ కేంద్రంలో అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరించి బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశ్యపూర్వకంగా వేధింపులకు గురిచేసి బూత్ ఎజెంట్లని వెళ్లగొట్టారని ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీకి బిజేపి రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి వినతి పత్రాన్ని అందజేసారు.కార్యకర్తలను ఎస్ఐ వెంకటస్వామి కాంగ్రెస్ కార్యకర్తలను సెల్ ఫోన్ లతో అనుమతించడం జరిగిందనీ పోలింగ్ ఆఫీసర్ వారించినా కూడా పట్టించుకోకుండా ఫోన్ బీజేపీ పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వడంతో ఫోన్ లో మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బీజేపీ ఏజెంట్లను బెదిరింపులకు గురి చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు.గేటు బయట ఉన్న ఎస్ఐ వెంకటస్వామి, కానిస్టేబుల్ రాజేందర్ కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించి బిజేపి నాయకులను అడ్డుకున్నారన్నారు.ఎస్ఐ పూర్తి సహకారంతో కాంగ్రెస్ వారిని సెల్ ఫోన్ తో సహా అనుమతించి, బీజేపీ నాయకులను గేటు బయటనే నిలిపివేసి, మా పోలింగ్ ఏజెంట్లను బెదిరింపులకు గురి చేయడంతోనే వారు పోలింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారన్నారు. దీనిపై నిరసన తెలుపడంతో ఏసీపీ, ఆర్డీఓ స్పందించి మరొక కార్యకర్తను ఏజెంట్ అనుమతించడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ వెంకటస్వామి గతంలో బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశ్యపూర్వకంగా వేధింపులకు గురిచేయడం, కార్యకర్తలు బొట్లు పెట్టుకున్నారని, కాషాయం కండువాలు వేసుకున్నారని, పోలీస్ స్టేషన్ కి పిలిపించి గంటల తరబడి పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడ్డారనీ తెలియజేసారు.హనుమాన్ జయంతి, శివాజీ జయంతి ఉత్సవాల నిర్వహణ అనుమతి కోసం ఎస్ వెంకటస్వామి వద్దకు వెళ్తే గంజాయి తాగేవాళ్ళు అంటూ మమ్మల్ని తీవ్ర అవమానానికి గురి చేయడం జరిగిందనీ అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగే సివిల్ పంచాయితీల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖం సింగ్ వీరాభిమానినని చెప్పుకుంటూ సెటిట్మెంట్లకు పాల్పడడం జరుగుతుందనీ, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని తిరిగి బెదిరింపులకు పాల్పడుతూ పీడీ యాక్టు పెడతానని, రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నాడని తెలిపారు.బాధ్యతాయుతంగా పోలీస్ విధులు నిర్వహించకుండా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వీరాభిమాననింటూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ఇతర పార్టీలపై విద్వేషాలు పెంచుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలని ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతున్న అంతర్గం ఎస్ఐ వేంకట స్వామి వ్యవహార శైలిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.సీపీకి వినతి పత్రం అందజేసిన వారిలో మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్, మిట్టపల్లి సతీష్, గుండబోయిన భూమయ్య నాయకులు సిలివేరు అంజి,మాడ అనీల్ రెడ్డి, కందుల పోచం తదితరులు ఉన్నారు...
Admin
Aakanksha News