Friday, 31 July 2026 07:35:06 PM

టాటా ఏఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

Date : 25 January 2025 05:46 PM Views : 578

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని అడ్డగుంటపల్లి ఆర్యవైశ్య భవనం నుండి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు.బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లీడర్లు ఏజెంట్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా ఆపోప అధ్యక్షులు కొమురవెల్లి సుధాకర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వేణుశెట్టి నటరాజశేఖర్, చేతుల మీదుగా జెండా ఊపి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అడ్డగుంటపల్లి కళ్యాణ్ నగర్ లక్ష్మీ నగర్ రీగల్ శూమార్ట్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో ముఖ్య అతిథిగా రామగుండం క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు, ఐఎంఓ రామగుండం అధ్యక్షులు డాక్టర్ కేస శ్రీనివాస్, లైన్స్ క్లబ్ కోలేటి శ్రీనివాస్, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్, టెంట్ హౌస్ అధ్యక్షులు లింగమూర్తి, లతోపాటు ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ పాల్గొనడం జరిగింది అలాగే ట్రాఫిక్ ఎస్ఐ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ వీరస్వామి, చంద్రశేఖర్, ఆదర్శ కుమార్, వర్మ, లీడర్ శాంతి, సృజన్, శ్రీకాంత్, రాజు, రామ్మూర్తి, విక్రమ్, అనిల్, చంద్ర ప్రకాష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :