ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం ఎరుగుల కర్మాగారంలో యాజమాన్యం బ్రిటిష్ పాలనను తలపిస్తుందని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మిక నేత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి అన్నారు.పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట మజ్జూర్ యూనియన్ నాయకులు అంబాటి నరేష్ అధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు టోకెన్ సమ్మె చేపట్టారు.కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కార్మికులకు చేస్తున్న పనికి తగ్గట్టుగా యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ యజమాన్యంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక నేత కౌశిక హరి హరి డిమాండ్ చేశారు. 2 సంవత్సరాలుగా సంస్థ ఉత్పత్తికి సహకరిస్తున్న తమకు జీతాలు పెంచాలని యాజమాన్యంనికి వినతిపత్రం ఇచ్చిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సమాన పనికి సమాన వేతనంతో పాటు, అలావెన్స్ లు ఇవ్వాలని,సంస్థకు వచ్చిన లాభాల నుండి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే పని స్థలం వరకు మోటార్ సైకిల్లను అనుమతించాలని, రానున్న వేసవి కాలం దృష్ట్యా కార్మికులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల పేరిట కొత్త కొత్త యూనియన్లు పుట్టుకొస్తున్నాయని, ఇప్పుడు వస్తున్న నాయకులు గతంలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఎందుకు పోరాటాలు నిర్వహించలేదన్నారు. ఇప్పటికైనా న్యాయమైన కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు
Reporter
Aakanksha News