Friday, 31 July 2026 03:50:42 PM

ఓబి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు కార్మిక సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు...

Date : 19 February 2025 08:08 PM Views : 453

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం రీజియన్ 1,2,3, డివిజన్ లోని ఓబి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కాంట్రాక్టు కార్మిక సంఘాల జెఎస్సీ ప్రకటించింది. ఈ సందర్బంగా గోదావరిఖనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో కార్మిక సంఘాల జేఎసీ అత్యవసర సమావేషాన్ని కే.విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, సీఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, టి యు సి ఐ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, టి ఎస్ ఎం సి డబ్ల్యూ యూ, ప్రధాన కార్యదర్శి సంఘం రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కే విశ్వనాథ్, ఏఐఎఫ్ టు యు రామగుండం కార్యదర్శి బి యాకయ్య, కార్మిక సంఘ నేతలు, శనిగల శ్రీనివాస్, మద్దెల శ్రీనివాస్ లు హాజరైయ్యారు.కార్మికులు చేస్తున్న స్వచ్ఛంద సమ్మె పట్ల ప్రభుత్వం, మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా నాయకత్వం వహించి కార్మికుల వేతనాలు పెంపుదల గురించి చేస్తున్న కృషి అభినందనయం అని అన్నారు. కోల్ ఇండియా వేతనాలు లేదా ఐ పవర్ వేతనాలు అమలు అయ్యే విధంగా కృషి చేయాలని అదే విధంగా కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన వారు చేస్తున్న న్యాయమైన పోరాటాల తరఫున ఎల్లవేళలా వాళ్లకు కృషి చేస్తాయని కార్మికులకు హామీ ఇచ్చారు. వేతనాల పెంపుదల కోసం చేస్తున్న నిరవధిక సమ్మె విజయవంతం అయ్యేదాకా సంఘటితంగా పోరాటం చేస్తూ సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :