Friday, 31 July 2026 05:26:14 PM

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి....

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ...

Date : 14 April 2025 04:53 PM Views : 465

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను మంథని నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంథనిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి పౌరుడు నడుచుకోవాలని అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాలకు న్యాయం చేశారని కొనియాడారు. మహిళలు,మాల సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు నూకల బాణయ్య,నూకల శంకర్, జంజర్లరాజు,ఆర్లబాపు, రాదండి శంకర్,అప్పల పోచమల్లు,జంజర్ల శ్రీనివాస్,జంజర్ల శేఖర్, ఆర్లనాగరాజు,ఎరుకల ప్రవీణ్,కారంగుల తిరుపతి,బడికల నరసయ్య,ఎరుకల వెంకటి,ఎరుకల మధు, మాల మహానాడు సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :