Thursday, 30 July 2026 07:05:49 PM

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే...

Date : 17 February 2025 08:58 AM Views : 352

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : తెలంగాణ అభివృద్ధి ప్రదాత... అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ దే అని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని BRS పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్టపై ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ...కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులుగా మళ్లీ రావాలంటూ ఆకాంక్షించారు. తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే ప్రజలే ఉద్యమాలు చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ, తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అధిరోహించి, తెలంగాణ ప్రజల బంగారు బాటకు పునాదివేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, BRS నాయకులు సయ్యద్ మోబినోద్దీన్, వెన్నం రవీందర్, పల్లె మధు, లవన్ కుమార్, బొంకూరి నిఖిల్, బొంకూరి అఖిల్, రేండ్ల నాగరాజు, బైరం నట రాజ్, ముత్యం లక్ష్మణ్ గౌడ్, మహేష్, కుక్క మనోజ్, అతిక్, ముబషీర్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :