ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గారంటీలను అమలు చేయాలని అలాగే పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్ లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 100 బైకులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలపై సర్వేలు చేయడం జరుగుతుందని, వీటి పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకేళ్లి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఒక బస్సు ప్రయాణం తప్ప మిగతావి ఏమి అమలు జరగలేదని అన్నారు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ఇవ్వలేదని, ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల ఇస్తామన్న అమలు జరగలేదని అన్నారు. రైతుబంధు పంట రుణమాఫీ పూర్తిగా జరగలేదని, రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారని ,వాళ్లకి సొంత ఇల్లు నిర్మిస్తామని గత ప్రభుత్వం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కానీ ఇప్పటివరకు ఎవరికీ కూడా ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. రెండు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలను గుర్తించి భూ పోరాటం చేయడం జరుగుతోందని అన్నారు. గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 500000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, జిల్లాలో పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు పెంచకుండా మోసం చేసిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలకు పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ , రాష్ట్ర నాయకులు బిక్షమయ్య , కోట రమేష్ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు , జిల్లా కమిటీ సభ్యులు కల్లేపల్లి అశోక్, సీపెళ్లి రవీందర్,జి జ్యోతి, మండల కమిటీ సభ్యులు మోదంపల్లి శ్రావణ్,జిల్లాల ప్రశాంత్,సీపెళ్లి దిలీప్,నవీన్,వెంకటస్వామి, ఖాజా, రాజమలు,సాగర్, CPMనాయకులు. తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News