ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఒకానొక ప్రాంతంలో తాను కాకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద రేషన్ షాప్ ను నిర్వహిస్తూ కొంతమంది షాపులతో కుమ్మక్కు అవడమే కాకుండా రోజువారిగా గల్లీలో రేషన్ బియ్యం తీసుకుంటామని వచ్చేవారితో కుమ్మక్కై అడ్డగుంటపల్లి, చంద్రశేఖర్ నగర్, విఠల్ నగర్, కెసిఆర్ కాలనీ తో పాటు ఇతర చోట్ల తనకంటూ ప్రత్యేకంగా రేషన్ బియ్యంను నిల్వ చేసేందుకు షటర్లు ఏర్పాటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే దీని వెనుక కొంత మంది ముఖ్య అధికారులకు ప్రతినెల మామూళ్లు వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ప్రతిరోజు నిఘా ఏర్పాటు చేస్తున్న అధికారులకు ఈ రేషన్ బియ్యం కనిపించడం లేదా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంతం నుండి రేషన్ బియ్యం తంతా నిర్వహిస్తున్న ఓ రేషన్ మాఫియా నిర్వాహకుడి పూర్తి వార్త కథనం రేపటి ఆకాంక్ష న్యూస్ లో...
Admin
Aakanksha News