ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలలోని చందనాపూర్ జడ్పీ హైస్కూల్‌లో ( 2000-2004 ) ఆరో తరగతి To ,పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చదువుకున్న స్కూల్‌లో 20 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. సుఖ సంతోషాలను వ్యక్తం చేశారు. ఆ పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాల తర్వాత కలసి ఆనందానికి అవధులు లేవు.అదేవిధంగా ప్రస్తుతం చేస్తున్న వ్యాపార, ఉద్యోగ తదితర వివరాలతో పాటు కుటుంబ వివరాలను సైతం ఒకరినొకరు పంచుకున్నారు. చదువు చెప్పిన గురువులను సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుల కృషి వల్ల ఉద్యోగం చేస్తున్నామని పలువురు కొనియాడారు. మీరు చూపించిన క్రమశిక్షణ వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని కొనియాడారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు దామోదర్, రాజమల్లు, విజయ్ కుమార్, కనకయ్య, తెలుగు రమేష్ , తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News