ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఆకాంక్ష డెస్క్ : సంపాదన అంటే పురుషుడి బాధ్యత అన్న పాతకాలపు విధానాలను తిరగరాస్తు కుటుంబ పోషణలో కీలకపాత్ర పోషిస్తూ పరీక్ష, ఉద్యోగ సాధనలోను పై చేయి కనబరుస్తున్నారు. అమ్మ, అక్క, చెల్లి, అత్త, వదిన, అమ్మమ్మ నాన్నమ్మ స్నేహితురాలు ఇలా వివిధ హోదాల్లో సమాజంలో సగభాగమైన మహిళలు లేనిదే సమాజ మనుగడ లేదు అనేది నిత్య కృత్యం. సాంప్రదాయపు మరదల నుంచి బయటికి వస్తున్న మహిళలు విద్యా. వైద్యం. పరిశోధన సాఫ్ట్ వేర్, రాజకీయం తదితర రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ తమకు ఎవరు సాటిలేరు అని నిరూపించుకుంటున్నారు. అయినప్పటికీ వారి పట్ల ఎక్కడో చోట వివక్షత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన మహిళల పట్ల జరుగుతున్న దారుణాలు, అగైత్యాలు ఆందోళనకు గురి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలకు పైగా కావస్తున్న పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఇప్పటికీ కొన్నిచోట్ల అనేక విభాగాల్లో మహిళలపై వివక్షత కొనసాగడం బాధాకరం.నేడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు... ఇప్పటికే మన దేశ కీర్తి ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి ఎంతో మంది మహిళలు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా వివిధ హోదాల్లో సమాజ ఉన్నతికి కృషి చేస్తూ తమ జీవితాలను త్యాగం చేస్తున్న మహిళలకు ఎంతైనా రుణపడి ఉండాల్సిన అవసరం ఉందనేది పలువురు భావన.
మహిళా అంటేనే ధైర్యానికి ప్రతీక... కందుల సంధ్యారాణి
మహిళ అంటేనే శక్తి ధైర్యానికి ప్రతీక ఆత్మవిశ్వాసం గుండె నిబ్బరం ఇలా ఎన్నో సుగుణాలు కలిగి ఉండబట్టే ఇంటికి ఇల్లాలు జీవనజ్యోతి అని మన పెద్దలు చెబుతూ ఉంటారని, ఎన్నో రంగాల్లో ప్రతిభను కనబడుతున్నప్పటికీ కొన్నిచోట్ల వివక్షతను మహిళలు ఎదుర్కోవడం బాధాకరమని బిజెపి రామగుండం నియోజకవర్గ అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి అన్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో మహిళల పట్ల వ్యవహరించే తీరు మారాలని ప్రతి మహిళ మన మాతృమూర్తి అని భావించాలని సాటి మహిళల పట్ల గౌరవం ఉన్నప్పుడే సమాజ స్థాపన జరుగుతుందని సంధ్యారాణి పేర్కొన్నారు.
Admin
Aakanksha News