Thursday, 30 July 2026 07:05:56 PM

పంట పొలం నుంచి తిరిగివస్తూ కాలువలో పడి రైతు దుర్మరణం....

Date : 11 July 2025 09:41 PM Views : 681

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలం పనులు ముగించుకొని ఇంటి దిశగా సైకిల్ పై వస్తున్న రైతు, ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి మృతి చెందిన విషాదకర ఘటన గురువారం చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన దాసరి మురళి (50), తండ్రి రాజయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మురళి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పొలం పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా గుంపుల గ్రామ శివారులో ఉన్న కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. కాలువలో పడిన మురళిని అక్కడే చనిపోయినట్లు గుర్తించారు.ప్రమాదవార్త తెలిసిన వెంటనే గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.మృతునికి భార్య దాసరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పొత్కపల్లి ఎస్‌ఐ దీకొండ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్థులు మురళి మృత్యుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :